చెప్పులు మోస్తున్నారు: టి నేతలపై కెసిఆర్, కెకెకు షాక్

K Chandrasekhar Rao
మహబూబ్‌నగర్: ప్రత్యేక రాష్ట్రంలో సర్కారు తెలంగాణ రాష్ట్ర సమితిదేనని ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు శనివారం అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో శనివారం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో జాతీయ పార్టీలు ఎప్పుడో కనుమరుగయ్యాయని, కాంగ్రెస్ కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీయేనని అన్నారు.

భవిష్యత్తులోనూ ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని, కాంగ్రెస్, టిడిపిలలో ఆంధ్ర నేతల చెప్పులు మోసే సన్నాసులున్నారు కాబట్టే తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. తెలంగాణ రావాలంటే, తెరాస రాజకీయ శక్తిగా ఎదగాల్సి ఉందన్నారు. వంద అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే, కేంద్రాన్ని డిమాండ్ చేసి తెలంగాణ సాధించుకోవచ్చన్నారు. తెరాస ఏర్పాటు చేస్తే చంద్రబాబు అవహేళన చేశారని, ఇప్పుడు ఆయన పార్టీ తెలంగాణలో మాయమైపోయిందన్నారు.

కాంగ్రెస్ కూడా మాయం కాబోతోందని చెప్పారు. ఆంధ్రలో చిన్నపాటి పంటనష్టం జరిగినా, ఎంతో గగ్గోలు చేసి ప్రధానిని సైతం తీసుకొస్తారని, అదే తెలంగాణలో తీవ్ర కరువు కొనసాగుతున్నా పట్టించుకోరన్నారు. తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వననడానికి అయ్య జాగీరా? అబ్బసొత్తా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అలా అన్నందున, ఆయన పార్టీకి ఒక్క ఓటు కూడా వేయబోమని గ్రామాల్లో తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.

చలో అసెంబ్లీ సందర్భంగా, పోలీసులు జులుం ప్రదర్శిస్తే అన్ని స్టేషన్లలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని కోరారు. తెలంగాణ కోసం తాను పార్టీ పదవులను సైతం త్యాగం చేశానని, టిడిపి నాయకులు ఆ పని చేయగలరా? అని కె.కేశవరావు అన్నారు. కెసిఆర్ తెగింపును నమ్మామని చెప్పారు. కాగా, కెసిఆర్ ప్రసంగిస్తుండగా... గతంలో తెలంగాణను అడ్డుకున్నవారే ఇప్పుడు వేదికపై ఉన్నారంటూ కెకెనుద్దేశించి ఓ కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణవాదులంతా ఒక్కటవుతున్నారని గుర్తించి మాట్లాడాలంటూ కెసిఆర్ అతడిని సున్నితంగా మందలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+