సిఎంకు తెలంగాణ సెగ: పోటీ చేయమన్న మంత్రులు

చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, కనీసం కొద్దిదూరం వరకైనా అనుమతించి తరువాత ఒక ప్రతినిధి బృందాన్ని శాసనసభలోకి అనుమతించాలని కోరారు. అయితే వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. అనుమతి ఇచ్చినా విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని ఇతర పార్టీల ప్రతినిధులు వెళ్లిపోయిన తర్వాత ఆయన తెలంగాణ మంత్రుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
గతంలో నెక్లస్ రోడ్‌లో ఆందోళనకు అనుమతి ఇస్తే విధ్వంసకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. ప్రతినిధి బృందానికైనా అనుమతి ఇవ్వాలని తాము ముఖ్యమంత్రిని కోరినట్లు ఓ మంత్రి చెప్పారు. తెలంగాణ మంత్రులు మంగళవారం కూడా శాసనసభలో విడతలవారీ కలిసి చర్చించుకున్నారు. తెలంగాణపై అధిష్టానం జాప్యం కారణంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని భేటీలో మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
శాసనసభ సమావేశాల అనంతరం ఢిల్లీకి వెళ్లి మరోసారి తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని సీనియర్ మంత్రి జానారెడ్డి చెప్పారు. అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని మరో మంత్రి వెల్లడించారు. తెలంగాణ మంత్రులు వరుస భేటీల కారణంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందువల్ల అంతా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కిరణ్ సహచర మంత్రులను కోరినట్టు తెలుస్తోంది. అధిష్టానం దీనిపై ఆలోచన చేస్తున్నందున అంతా వేచి చూడాలని సూచించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications