పొత్తు చిత్తు: నితీష్ విశ్వాస వ్యూహం, బిజెపి రాజీనామా

అంతకుముందు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం భేటీ అయింది. ఈ భేటీకి కూటమిలోని బిజెపి మంత్రులు గైర్హాజరయ్యారు. నితీష్ మధ్యాహ్నం గవర్నర్‌ను కలుసుకున్నారు. గవర్నర్‌ను కలిసిన నితీష్ విశ్వాస నిరూపణకు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 19న బిహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పరిచి నితీష్ విశ్వాస తీర్మానం కోరే అవకాశాలున్నాయి.
మరోవైపు బిజెపి అధిష్టానం జెడి(యు)కు ధీటుగానే స్పందిస్తోంది. మంత్రివర్గ సమావేశానికి రాని బిజెపి మంత్రులు ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీకి తమ రాజీనామాలు అందించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను కలిసి రాజీనామాలు ఇచ్చే అవకాశాలున్నాయి.
బిజెపి మంత్రులు రాజీనామా చేసి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వానికి ఇప్పటికి ఇప్పుడు వచ్చే నష్టమేమీ లేదు. ప్రభుత్వ మెజార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు తగ్గినా స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పి నితీష్ గాలం వేసినట్లుగా తెలుస్తోంది. బిజెపి మద్దతివ్వనప్పటికీ స్వతంత్ర సభ్యులు, ఇతరుల ద్వారా గట్టెక్కవచ్చునని నితీష్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications