కూతురు కోసం కరుణానిధి పాట్లు, జయలలిత నిప్పులు

అందుకోసం ఆయన కాంగ్రెసు పార్టీ సహకారం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెసు సహకారం తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కనిమొళిని తిరిగి రాజ్యసభకు పంపించేందుకు డిఎంకెకు తగిన బలం లేదు. దీంతో కాంగ్రెసు పైన అసంతృప్తి ఉన్నప్పటికీ మద్దతును కోరుతున్నారు.
డిఎంకె అసంతృప్తితోనే యూపిఏ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతిస్తోంది. తమిళనాడులో జూన్ 27న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో మిత్రపక్షాలతో కలిసి కనిమొళిని గట్టెక్కించాలని చూస్తున్నారు. తమిళనాడులో ఆరు రాజ్యసభ సీట్లు ఉన్నాయి.
ఏడుగురు పోటీ పడుతున్నారు. అన్నాడిఎంకె నుండి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. సిపిఐ నుండి, డిఎంకె నుండి రాజా, కనిమొళిలో బరిలో నిలుస్తున్నారు. రాజా, కనిమొళిలు ఇద్దరు తగిన బలం లేకుండానే బరిలోకి దిగుతుండటం విశేషం. జయలలిత కూటమి ధర్మాన్ని పాటించనందునే అందుకే తమ అభ్యర్థిని బరిలోకి దింపామని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు.
కాగా తన కూతురు కనిమొళిని రాజ్యసభకు పంపించేందుకు కరుణానిధి కాంగ్రెసు పార్టీతో సాఫ్టుగా ఉంటున్నారని ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications