తెలంగాణ బాధ్యత మాదే: కిరణ్, జగన్‌తో వెళ్లండి: రేవంత్

తక్కువ అరెస్టులతో తమ ప్రభుత్వం, పోలీసులు సంయమనంతో వ్యవహరించారన్నారు. తెలంగాణవాదం తగ్గించాలన్న ఉద్దేశ్యం తమకు ఏమాత్రం లేదన్నారు. సభ సజావుగా ఎందుకు సాగడం లేదో ప్రజలకు తెలుసునని అన్నారు. సభ సజావుగా సాగక పోవడానికి సభాపతిని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.
తెలంగాణ సమస్య అంత సులభమైనది కాదన్నారు. అది యాభై ఏళ్లుగా ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం, తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ విషయంలో సరైన పరిష్కారం చూపించే మార్గం కాంగ్రెసు పైన ఉందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
మంత్రుల వల్లే లక్ష కోట్లు: రేవంత్
కళంకిత మంత్రులను ముందుపెట్టి ప్రభుత్వం శిఖండిలా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ మంత్రుల సంతకాల వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు సంపాదించారన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ఆరోపణలనే మంత్రి గీతా రెడ్డి చేశారన్నారు. గీతా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనుకుంటే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. అది తమకు సంబంధించిన విషయం కాదన్నారు. కాంగ్రెసు ఎంపీలు పార్టీలు మారుతుంటే గీతా రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications