తోబుట్టువుల ఫీజు చెల్లించేందుకు ఓ డ్రైవర్ దొంగతనం

Cell Robbery
హైదరాబాద్: ఓ యువకుడు తన సోదరు, సోదరుడి ఫీజులు చెల్లించేందుకు పిక్ పాకెటర్‌గా మారాడు. బండి రాములు అనే 26 ఆరేళ్ల యువకుడు ఆటోలు, మినీ లారీలు నడుపుతుంటాడు. అతను దాదాపు 130 మొబైల్ ఫోన్స్‌ను దొంగిలించాడు. వాటి విలువ రూ.5 లక్షలకు పైగా ఉంటుంది. ఇతను గత రెండేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతను తన తోబుట్టువుల కోసం ఓ కారును, ద్విచక్రవాహనాన్ని కూడా కొనుగోలు చేశాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోవడంతో ఎంబియే, బిడిఎస్ చదువుతున్న తన తోబుట్టువుల ఫీజుల కోసం దొంగతనం చేశానని చెప్పాడు.

వరుస చోరీల నిందితుల అరెస్ట్

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడి ప్రజలను బెంబేలెత్తించిన ఇద్దరు నిందితులను హయత్‌నగర్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.8 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం పట్టణానికి చెందిన సవరాల శ్రీనివాస్ (25), కాకినాడకు చెందిన కర్రి శ్రీనివాస్ (24) పాత నేరస్తులు.

2007లో జైలులో కలిసిన వీరిద్దరూ రాష్ట్రంలోని జగ్గయ్యపేట, వైజాగ్, గుంటూరు, సైబరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మూడు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన వీరు గుంటూరు, హైదరాబాద్‌లో చోరీలకు పాల్పడ్డారు.

గత ఏప్రిల్ 30న హయత్‌నగర్, ఆర్టీసీ కాలనీలో మూడిళ్లలో, రాఘవేంద్రనగర్, శాంతినగర్ కాలనీల్లో చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హయత్‌నగర్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. నిందితులను విజయనగరం పట్టణంలో అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+