వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరణుడు: 131 మంది మృతి, వరదల్లో వేలాది మంది

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని వర్షం ముంచెత్తుతోంది. దీంతో ఇప్పటి వరకు 131 మంది మరణించారు. వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 71,440 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 1700 మంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

వరదలు, కొండచరియలు విరిగిపడి పరిస్థితి అత్యంత విషాదభరితంగా మారిపోయింది. గంగానది, దాని ఉపనదుల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక చర్యలకు మార్గం సుగమమైంది. ఉత్తరాఖండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది.

 Rain Fury

ఉత్తరాఖండ్‌లో 44 మంది మరణించారు. ఎంతో మంది గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రుద్రప్రయాగ అత్యంత దారుణంగా వరదల తాకిడికి గురైంది. ఈ ప్రాంతంలో 20 మంది మరణించారు. అలకానంద ఒడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. 40 హోటళ్లతో పాటు 73 భవనాలు ధ్వంసమయ్యాయి. కేదార్‌నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యుమనోత్రిలకు వచ్చిన యాత్రికులు 71,440 మంది రుద్రప్రయాగ్, చమోలి, ఉత్తర కాశీ జిల్లాల్లో చిక్కుకుపోయారు. రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రసిద్ధ చర్ధామ్ యాత్రను నిలిపేశారు.

చమోలీలో 27040, రుద్రప్రయాగలో 25000 మంది, ఉత్తరకాశీలో 9,850 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు ప్రకృతి విపత్తుల నిర్వణ అధికారవర్గాలు చెప్పాయి. ఉత్తరకాశీలో భాగీరథి, రిషికేశీలో గంగానది వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎడతెరిపి లేని వర్షాలతో కొండ చరియలు విరిగిపడుతుండడంతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ 60 గంటల పాటు కన్నౌరు జిల్లాలో చిక్కుకుపోయారు.

హెలికాప్టర్ సహాయంతో వీరభద్ర సింగ్‌ సురక్షితంగా అక్కడి నుంచి బయటపడ్డారు. హెలికాప్టర్ ద్వారా రాంపూర్‌కు డజను మందిని తరలించారు. ఉత్తరప్రదేశ్‌లో నలుగురు మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

<center><center><center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="1" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /> <div id="vnVideoPlayerContent"></div> <script> var ven_video_key="MTM3NjU3fHwyfHwxfHwxLDEsMQ=="; var ven_width="650"; var ven_height="417"; </script> <script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center></center></center>

English summary
Rain fury claimed 11 more lives on Tuesday in the north, taking the toll to 131, even as 71,440 pilgrims bound for the Himalayan shrines remained stranded in monsoon-ravaged Uttarakhand apart from 1700 people stuck in Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X