కెటిఆర్ స్టోరీఎఫెక్ట్: సైలెన్స్‌పై మోత్కుపల్లి, హరీష్ వివరణ

తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణ సాధన లక్ష్యంగా కాకుండా కెటిఆర్‌ను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణపై తీర్మానం అంటూ నిన్నటి వరకు రాద్దాంతం చేసి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నారని ప్రశ్నించారు. కెటిఆర్ కోసం తెలంగాణవాదాన్ని పక్కన పెట్టారన్నారు. సభను ఇప్పుడు అడ్డుకోకపోవడం వెనుక కారణమదేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల్లా కూర్చున్నారన్నారు.
కెసిఆర్ కుటుంబం మరో నిజాంను తలపిస్తోందన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు మరోసారి బయటపడిందన్నారు. ఆంధ్రజ్యోతి కథనం సెగ తగలడం వల్లే మౌనంగా కూర్చున్నారన్నారు. ఉదయం అంతా గొడవ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తీర్మానంపై మాట్లాడటం లేదన్నారు. చరిత్రలో ఏ ఉద్యమకారుడు అయినా ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారని, కెసిఆర్ మాత్రం ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు.
ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్న చరిత్ర కెసిఆర్‌కే దక్కిందన్నారు. కెసిఆర్ తన ఆస్తులపై సిబిఐ విచారణ కోసం లేఖ రాయాలన్నారు. తమను విమర్శిస్తున్న వారిపై తెరాస వారు తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారన్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరిస్తున్నట్లుగా తెలిసిందన్నారు.
టిడిపి మాటలు నమ్మరు: హరీష్ రావు
తెలుగుదేశం పార్టీ గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సమస్యలపై చర్చించేందుకే తాము మౌనంగా ఉంటే.. వక్రీకరించడం సరికాదన్నారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయింది కాబట్టే చంద్రబాబు పేరు సూసైడ్ నోట్‌లో ఉన్నా కేసు నమోదు చేయలేదన్నారు. సబ్ ప్లాన్ పై చర్చ సందర్భంగా తాము సహకరించామని, ఇప్పుడు కూడా అందుకోసమే సహకరిస్తున్నామన్నారు. టిడిపికి మాట్లాడే అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications