ప్యాకేజ్ అవివేకం: వెంకయ్య, తెరాసదే కీలక పాత్ర: కెకె

ఉత్తర భారతంలోని భారీ వరదల కారణంగా జరిగిన నష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. అధికార కాంగ్రెసు పార్టీ మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకొని, తమపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని చెప్పడం విడ్డూరమన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెసు లౌకికవాదం జపం చేస్తోందని మండిపడ్డారు. మూడో ఫ్రంట్‌ను ప్రజలు నమ్మరన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైపు అందరూ చూస్తున్నారన్నారు. మోడీ ప్రధాని కావాలని సర్వేలన్నీ చెబుతున్నాయన్నారు. కాగా అంతకుముందు పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ భేటీ అయ్యారు. మోడీకి వ్యక్తిగతంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పట్లనే తాను అసంతృప్తి చెందానని, అందరు సమష్టిగా పని చేస్తే ఇబ్బందులు ఉండయని అద్వానీ అన్నట్లుగా సమాచారం.
మున్ముందు తెరాస కీలక పాత్ర: కెకె
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె కేశవ రావు అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెరాస భూమిక ప్రభుత్వంలో ఎంతో ఉంటుందన్నారు. జాతీయ రాజకీయాల్లోను తమ ముద్ర ఉంటుందన్నారు. గవర్నర్ నరసింహన్ తీరు సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వనంటే కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications