నెలాఖరులో తెలంగాణపై నిర్ణయం, ప్యాకేజీకే గవర్నర్?

Telangana: Climax by June end
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి పలు సూచనలు చేశారట. తెలంగాణపై అధిష్టానం ఈ జూన్ నెలాఖరు వరకు ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ప్రధానంగా భారీ ప్యాకేజ్ ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. అదే సమయంలో గవర్నర్ కూడా సూచనలు చేశారట.

తెలంగాణ సమస్య పరిష్కారానికి వివిధ మార్గాలను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్న సమయంలో, ప్రత్యేక తెలంగాణ ప్రకటించకుండానే ప్యాకేజీ ఏ రూపంలో అమలు చేయాలన్న విషయంపై గవర్నర్ సూచనలు ఇచ్చారట. సరైన సురక్షిత చర్యలతో కూడిన ప్యాకేజీని ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రజల నమ్మకాన్ని చూరగొనవచ్చునని చెప్పారట. సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటే కట్టుదిట్టంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. నరసింహన్ ఈ రోజు ఢిల్లీ నుండి హైదరాబాదుకు తిరిగి బయలుదేరారు.

మరోవైపు తెలంగాణ సమస్యపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిధి పిసి చాకో ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ప్యాకేజీ విషయంపై తాము ఎలాంటి నిర్ణయానికి రాలేదని చాకో, ఆయనతో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్న హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ చెప్పారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన మాజీ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని కలుసుకున్నారు.

ఢిల్లీ విశేషాలు చెప్పిన డిసిఎం

గురువారం ఉదయం ఢిల్లీ నుండి హైదరాబాదుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిలతో భేటీ అయ్యారు. ఆయన వారితో తన ఢిల్లీ టూర్ విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+