బాబును కిరణ్ బ్లాక్‌మెయిల్ చేయలేదా?: జగన్ పార్టీ

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టిడిపి, కిరణ్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. ఇటీవల ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికినా చంద్రబాబు ఎందుకు పలకలేదని ప్రశ్నించారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎన్నికలు జరపకుండా ప్రయత్నాలు చేయడం నిజం కాదా అని వారు లేఖలో పేర్కొన్నారు.
వైయస్ మరణం తర్వాత టిడిపి, కాంగ్రెసు ప్రతి ఎన్నికలలో సహకరించుకోవడం నిజం కాదా అని, అవిశ్వాస తీర్మానం సమయంలో సహకారం కోసం కిరణ్ ఐఎంజి భూముల వ్యవహారంపై చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయడం నిజం కాదా అని, జాతీయ మీడియా చెబుతున్నట్లు రహస్య మైత్రి నిజం కాదా అని, 2014 ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది నిజం కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణను అడ్డుకుంది చంద్రబాబే: ఈటెల
తెలంగాణను అడ్డుకుంది చంద్రబాబు నాయుడేనని ఈటెల రాజేందర్ అన్నారు. తమపై వచ్చే ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా బాబు తీరు ఉందన్నారు.
సభ వాయిదా
గురువారం సభ ప్రారంభమైన తర్వాత సభాపతి విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. కిడ్నాప్‌లు, బెదిరింపులు తదితర అంశాలపై టిడిపి, తెలంగాణపై తీర్మానం కోరుతూ టిఆర్ఎస్, ఐఎంజి భూకేటాయింపులపై వైయస్సార్ కాంగ్రెసు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్దీకరణపై సిబిఐ, గిరిజన, గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ అధ్యాపకుల సమస్యపై సిపిఎం వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. వీటిని స్పీకర్ తిరస్కరించారు.












Click it and Unblock the Notifications