మోడీ నిరంకుశుడు, రాజ్ గుంటనక్క: అద్వానీ సపోర్టర్

అయితే, అద్వానీ అనారోగ్యమే భేటీ వాయిదాకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గోవా కార్యవర్గ భేటీకి కూడా అనారోగ్యం కారణంగా అద్వానీ గైర్హాజరు కావడం గమనార్హం. గంగా నదీ అంశంపై బుధవారం పార్టీ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కూడా అద్వానీ వెళ్లలేదు. కాగా, పార్టీ మాజీ అధ్యక్షుడు గడ్కరీ న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భగవత్‌ను కలుసుకున్నారు.
మోడీ నిరంకుశుడు: సుధీంద్ర
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై సొంత పార్టీలో విమర్శల జడివాన కొనసాగుతూనే ఉంది. "నరేంద్రమోడీ ఓ నిరంకుశుడు. రాజ్‌నాథ్ సింగ్ ఓ గుంట నక్క'' అంటూ అద్వానీ మిత్రుడు సుధీంద్ర కులకర్ణి విరుచుకుపడ్డారు. నిజానికి.. మంగళవారం అద్వానీని ఆయన నివాసంలో మోడీ స్వయంగా కలిసి మాట్లాడిన తరువాత, ఇక వివాదం సమసిపోయినట్టేనని అంతా భావించారు. అయితే, ఆ భేటీకి ఒక రోజు ముందు, కులకర్ణి రంగంలోకి వచ్చారు.
మోడీని, రాజ్‌నాథ్‌ని పరుష పదజాలంతో తూర్పారబడుతూ సోమవారం వ్యాసం పోస్టు చేశారు. "గద్దెని ఎక్కాలని చూస్తున్న ఓ నిరంకుశుడు (మోడీ), దాని కోసం నిజమైన ప్రజాస్వామ్య వాదిని(అద్వానీ) పక్కకు నెట్టేస్తున్నారు. ఆయనను అవమానిస్తున్నారు. సొంత రాష్ట్రంలోని ఆ స్వార్థపరుడి మనుషులంతా ఒక్కసారిగా జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంటున్నారు. మరోవైపు ఇటుక ఇటుక పేర్చి కష్టపడి పార్టీని నిర్మించిన నిస్వార్థ వ్యక్తిని ఎందుకూ పనికిరాని పాత వస్తువులా పక్కన పడేస్తున్నారు'' అంటూ మోడీని ఉద్దేశించి దుయ్యబట్టారు. రాజ్‌నాథ్‌ని కూడా కులకర్ణి వదలలేదు.
"ఆయనో గుంటనక్క. ప్రధానమంత్రి పదవి విషయ మై ఆయన భ్రమల్లో ఉన్నారు. దానికోసమే పార్టీలో అద్వానీ స్థానాన్ని ఉపేక్షిస్తున్నారు'' అని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్‌పైనా విసుర్లు వేశారు. జిన్నా వివాదంలో అద్వానీని దోషిని చేసి ఆయన అధికారాలన్నింటినీ 2005లో ఆర్ఎస్ఎస్ తొలగించేయడం వెర్రితనమని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications