ఢిల్లీ సిఎం కోడలినంటూ ఆంధ్రా మహిళ మోసం, అరెస్టు

Andhra Woman arrested for posing as Sheila Dikshit's daughter in law
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తాను షీలా దీక్షిత్ కోడలినంటూ మోసం చేసే ప్రయత్నాలు చేసింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఓ వజ్రాల వ్యాపారీకి తాను షీలా దీక్షిత్ కోడలినని చెప్పు ఆయనకు టోపీ పెట్టే ప్రయత్నం చేసింది. ఆమె కుట్ర బెడిసి కొట్టింది.

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉండే షిఖా భాటియా అనే ముప్పై మూడేళ్ల మహిళ... లజపత్ నగర్‌లలోని జిందాల్ డైమండ్ దుకాణానికి ఫోన్ చేసింది. తాను ముఖ్యమంత్రి కోడలినని చెప్పుకొంది. విమానాశ్రయానికి వెళ్తున్నానని, కొన్ని వజ్రాల గాజులను కాన్పూర్ చౌక్‌కు పంపాలని కోరింది.

అనుమానం వచ్చిన దుకాణ యజమాని సిద్ధార్థ జిందాల్.. వెంటనే షీలా కుమారుడు, పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ కార్యాలయానికి ఫోన్ చేశారు. ఆయన భార్య మోనా దీక్షిత్ అలాంటి కాల్స్ చేయలేదని సిబ్బంది స్పష్టం చేసింది. దీంతో యజమాని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులను తన సిబ్బందిగా పేర్కొంటూ... ఆయన ఫోన్ నంబరును యజమాని సదరు మహిళకు ఇచ్చాడు. వీరు కూడా వ్యూహం ప్రకారం కాన్పూర్ చౌక్‌కు చేరుకున్నారు. ఆమెకు వారు నకిలీ నగలను అందించారు. ప్రతిగా ఆమె రూ.3.89 లక్షల మొత్తానికి మోనా దీక్షిత్ సంతకంతో కూడిన చెక్కును అందించింది.

ఆమె మోసం చేస్తుందని తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. విచారణ చేపట్టారు. ఆమె ఎపి మహిళ అని గుర్తించారు. ఆమె తన భర్తతో ఢిల్లీలో ఉంటోందని దర్యాఫ్తులో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+