విరాళాలకోసం సోనియా విజ్ఞప్తి: వరద బీభత్సం(పిక్చర్స్)
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో వేలాది మంది చిక్కకుపోయిన విషయం తెలిసిందే. ఇందులో మృతులు వేల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మన రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందారు. చార్ ధామ్ యాత్రకు వెళ్లిన వందలాది మందిని సిబ్బంది రక్షించి న్యూఢిల్లీలోని ఎపి భవన్‌కు తరలించింది. ఎపి భవన్‌లో ఉన్న బాధితులను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తదితరులు శుక్రవారం పరామర్శించారు.
నిన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తదతరులు పరామర్శించారు. ఎపి భవన్‌లో ఉన్న వారిని మన రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కాజీపేట మీదుగా ఢిల్లీకి రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 226 మంది చార్ ధామ్ యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు వారి బంధునవులకు సమాచారం అందింది.
కేదారినాథ్ యాత్రకు వెళ్లిన ఐదుగురు ఎపి యాత్రికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన 15 మంది యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన దాదాపు మూడువేల మంది వరదల్లో చిక్కుకోగా.. ఐదు వందల మందికి పైగా ఢిల్లీ ఎపి భవన్‌కు సురక్షితంగా చేరుకున్నారు. వారికి ఎపి భవన్‌లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వరద బాధితులకు రుషికేష్‌లో టిటిడి తరఫున ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు ప్రకటించారు. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, రుషికేష్ ప్రాంతాల్లో వసతి కల్పిస్తామన్నారు. సహాయక చర్యలో 45 హెలికాప్టర్లు పాలుపంచుకుంటున్నాయి.
సోనియా విజ్ఞప్తి
ఉత్తరాఖండ్ వరదలు, భారీ నష్టం నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 30వేల మందిని భద్రతా సిబ్బంది కాపాడింది. మరో 50 వేల మంది రక్షణ కోసం అర్థిస్తున్నారు. వేలాది మంది ఆచూకి గల్లంతైంది. వరదల్లో 1100 రోడ్లు, వందలాది వంతెనలు ధ్వంసమయ్యాయి.

ఉత్తర భారతంలో కురిసిన వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి.

ఈ వరదల్లో దాదాపు డెబ్బై వేల మందికి పైగా చిక్కుకుపోయారు.

హెలికాప్టర్లు, సైన్యం, పోలీసులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు.

వరదల నేపథ్యంలో కేంద్రం ఉత్తరాఖండ్‌కు రూ.1000 కోట్ల సహాయం అందించనుంది.

బీహార్, ఒడిశా రాష్ట్రాలు రూ.5 కోట్ల చొప్పున ఇచ్చాయి. బిజెపి ఎంపి శత్రఘ్ను సింహా రూ.50 లక్షలు అందచేశారు.

దైవ దర్శనానికి వచ్చి వరదల్లో చిక్కుకుపోయిన భక్తులను కాపాడుతున్న భద్రతా సిబ్బంది.

కొండల్లో చిక్కుకుపోయిన భక్తులు తమ లగేజ్‌తో పాటు రాళ్ల మధ్య భద్రతా సిబ్బంది సహాయంతో వస్తున్నారు.

వరదల్లో చిక్కుకొని గాయపడ్డ ఓ బాధితుడికి ప్రాథమిక చికిత్స చేస్తున్న భద్రతా సిబ్బంది

వరదల్లో చిక్కుకొని తాత్కాలికంగా ఓ చోట సేద తీరుతున్న భక్తులు

నీళ్లలో చిక్కుకుపోయిన వారిని పడవల్లో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న భద్రతా సిబ్బంది.

ఓ కొండపై చిక్కుకున్న ప్రయాణీకులు భద్రతా సిబ్బంది సూచనల మేరకు కిందకు దిగుతున్నారు.

వృద్ధురాలైన మహిళను వాహనంలోకి ఎక్కిస్తున్న భద్రతా సిబ్బంది.

వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రాంత విహంగ వీక్షణం...

వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రాంత విహంగ వీక్షణం... వరదలో రోడ్డు కొట్టుకుపోయిన దృశ్యం.

కొండల్లో చిక్కుకుపోయిన వారిని భద్రతా సిబ్బంది కర్ర వంతెన ద్వారా రక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం

వర్షంలోను భక్తులకు భద్రతా సిబ్బంది ఆసరా... భక్తులకు సూచనలు చేస్తున్న దృశ్యం

కొండ ప్రాంతాల్లో చిక్కుకోవడంతో వారిని భద్రంగా కిందకు దించుతూ...

వరదల్లో చిక్కుకుపోయిన వారిని వరదల్లో సురక్షిత ప్రాంతానికి తరలింపు

వరదల్లో చిక్కుకొని మూడ్రోజులుగా తిండి లేని వారికి వేడివేడి ఫలహారం ఇస్తున్న భద్రతా సిబ్బంది

వరదల్లో చిక్కుకొని బయట పడ్డ వారికి నీటిని అందిస్తూ...

వరదల్లో చిక్కుకుపోయిన వారిని భద్రతా సిబ్బంది కర్ర వంతెన ద్వారా రక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం

మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న భద్రతా సిబ్బంది

ఉత్తరాఖండ్‌లోని ఓ సురక్షిత ప్రాంతానికి చేరుకున్న బాధితులు

నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తిని పడవలోకి లాగుతున్న భద్రతా సిబ్బంది

ఆర్మీ క్యాంపులో భక్తులకు షెల్టర్

నీటిలో చిక్కుకుపోయిన చిన్నారులను పడవలో తీసుకెళ్తున్న సిబ్బంది

భద్రతా సిబ్బంది బాధితులకు ఆహారం అందిస్తున్న దృశ్యం

నీటిలో ఈదుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి

వాహనంలో బాధితులకు చికిత్స అందిస్తున్న భద్రతా సిబ్బంది

కొండ పైన చిక్కుకుపోయిన భక్తులను సురక్షితంగా కిందకు దించూతూ...

నడువలేని ఓ భక్తుడిని ఇద్దరు జవాన్లు కిందకు తీసుకు వస్తున్న దృశ్యం

కర్ర వంతెన దాటిస్తున్న భద్రతా సిబ్బంది

వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రాంత విహంగ వీక్షణం...

చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న భద్రతా సిబ్బంది

వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రాంత విహంగ వీక్షణం... నీటితో నిండిన దృశ్యం

కొండల్లో చిక్కుకున్న చిన్నారులను రక్షిస్తున్న భద్రతా సిబ్బంది

వరదల కారణంగా కోతబడిన రహదారిని చూస్తున్న సైనికుడు

వరదల్లో చిక్కుకొని కూలిపోయిన భవంతులు

ఉత్తరాదిన కురిసనన వర్షాలతో ఓ చోట వరద ఉధృతి












Click it and Unblock the Notifications