వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఇఇ అడ్వాన్స్‌డ్: టాప్ టెన్‌లో నలుగురు తెలుగువాళ్లే

By Pratap
|
Google Oneindia TeluguNews

IIT-JEE Advanced
హైదరాబాద్: జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్‌లో నలుగురు తెలుగువాళ్లే చోటు చేసుకున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన 16 ఐఐటిలతో పాటు 150 వరకూ జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలో రాష్ట్రానికి చెందిన పి సాయిసందీప్‌రెడ్డి (6006070) జాతీయ టాపర్‌గా నిలిచాడు. జెఇఇ మెయిన్స్‌లో ఎంపికైన లక్షన్నర మందితో పోటీపడి అడ్వాన్స్‌డ్ పరీక్షలో సాయి సందీప్ ఈ విజయాన్ని సాధించాడు.

జాతీయస్థాయిలో రెండో ర్యాంకు కూడా మన రాష్ట్రానికే దక్కింది. ఎ రవిచంద్ర (6015069) రెండో ర్యాంకు సాధించగా, ఎం విశ్వవిరించి (6001059) ఏడో ర్యాంకు, ఎస్ లీనామాధురి (6027289) 8వ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలోని తొలి వంద ర్యాంకుల్లో 55 ర్యాంకులు రాష్ట్ర విద్యార్ధులకే దక్కాయి.

తొలి 25ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఉన్నారు. వీరంతా కేట్ పరీక్షలోనూ ర్యాంకుల పంట పండించిన వాళ్లే. సానంపూడి వెంకట శైలేష్‌కు జాతీయస్థాయిలో 16వ ర్యాంకు, మరుపల్లి కులదీప్‌కు 17, మల్లాడి కార్తీక్ దీక్షిత్‌కు 21, వేగుల క్రాంతికి 26, ఫరాన్ అహ్మద్‌కు 34, కె సుమకు 35, సిద్ధార్ధ బులియకు 38, కందుల వర్షితకు 41వ ర్యాంకు, తోట వెంకటసాయి ధీరజ్‌కు 42, కూసుపాటి నితీష్‌రెడ్డికి 45, వెంకటేశ్వరరావు చిప్పాడకు 47, ప్రతాప్ వెంకట ఆదిత్యకు 49, సుమిత్‌కుమార్‌కు 50వ ర్యాంకు దక్కాయి. టాపర్‌కు 332 మార్కులు టాపర్‌గా నిలిచిన సాయి సందీప్‌రెడ్డికి రెండు పేపర్లు కలిపి 332 మార్కులు దక్కాయి.

రెండో ర్యాంకర్ రవిచంద్రకు 330, ఏడో ర్యాంకర్ విశ్వవిరంచికి 315 మార్కులు, సిబ్బాల లీనామాధురి 314 మార్కులు సంపాదించారు. 16వ ర్యాంకు సాధించిన వెంకటశైలేష్‌కు 305 మార్కులు, 17వ ర్యాంకర్ మురపల్లి కులదీప్‌కు 305 మార్కులు, మహ్మద్ ఓవైసీ ఖాన్‌కు 305 మార్కులు దక్కాయి. 21వ ర్యాంకు సాధించిన కార్తీక్ దీక్షిత్‌కు 302, 26వ ర్యాంకర్ క్రాంతికి 300 మార్కులు వచ్చాయి. కొత్త కటాఫ్ 457మార్కులు సిబిఎస్‌ఇ ఇచ్చిన నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ 20 పర్సంట్ కటాఫ్ మార్కులను బోర్డు కార్యదర్శి రామ శంకరనాయక్ శుక్రవారం ప్రకటించారు.

ఒసిలకు కటాఫ్ పరిధి 457 మార్కులు కాగా, ఎస్సీలకు 417, ఎస్టీలకు 426, బీసీలకు 446 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించామని వివరించారు. దీనివల్ల ఒసీల్లో 147941 మంది, ఎస్సీలు 24354 మంది, ఎస్టీలు 8849 మంది, బీసీలు 72904 మంది ఐఐటిల్లో చేరే అర్హత సాధించారని చెప్పారు.

English summary
Two students from Hyderabad secured the top two ranks in the Joint Entrance Examination (Advanced), which guarantees admission in the IITs across the country. Two others from the state, including a girl student, made it to the top 10 out of the 1.15 lakh candidates who sat for the exam on June 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X