హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తరాఖండ్ ట్రాజెడీ: 11 మంది హైదరాబాదీలు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ఛార్‌దామ్ యాత్రకు వెళ్లిన 21 మందిలో 11 మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వరదల్లో చిక్కుకుని సురక్షితంగా వచ్చిన టూర్ ఆపరేటర్ రవి ఢిల్లీలో ఆ విషయం చెప్పారు. తమ కళ్ల ముందే 11 మంది కొట్టుకుపోయారని, వారిలో తన తల్లి కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న కొంత మంది తెలుగువాళ్లను సైన్యం సురక్షితంగా బయటకు తరలించింది. విజయవాడకు చెందిన బి సమారణ్, హైదరాబద్‌కు చెందిన డి గోపాలకృష్ణ, డిబి జానికి, శ్రీనివాస రెడ్డి వరద ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

 Kedarnath shrine

కర్నూలు జిల్లాకు చెందిన చంద్రావతి, శారదమ్మ, గౌరవ్ శుక్లా, మీనాక్షి శుక్లా, లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తి, నిజామాబాద్‌కు చెందిన అరుణ, జి. భాస్కర్, జి. విజయలక్ష్మి, శ్రీనివాస్, కరీంనగర్ జిల్లాకు చెందిన నరసింహులు, అక్రమ్, భాగ్యలక్ష్మి, కె. రాణి, భారతీరావు, మణెమ్మ, రఘు సత్యలాల్, సింధులను సైన్యం రక్షించింది. అలాగే, రాష్ట్రానికి చెందిన కృష్ణకాంత్, సత్యవాణి, కె. లక్ష్మి, జ్యోతి, కైలాస్, ప్రభాకర్ కూడా సురక్షితంగా బయటపడ్డారు.

ఉత్తరాఖండ్ వరద బాధితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెంటనే రాష్ట్రానికి తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

English summary
According to officials report - 11 Hyderabadis dead in Uttarakhand flash floods. Meanwhile, CM Kiran kumar Reddy reviewed the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X