టిక్కెట్ రాకుంటే ఏం చేస్తానో అప్పుడే చెప్తా: రాములమ్మ

Vijayasanthi
హైదరాబాద్: తనకు మెదక్ పార్లమెంటు టిక్కెట్ రాకుంటే.. ఏం చేస్తాననే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతానని తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి సోమవారం అన్నారు. వచ్చే ఎన్నికలలో తెరాస 100 అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానాలలో గెలుస్తుందని అప్పుడే ఎలా చెప్పగలమని అన్నారు.

తనను మెదక్ ప్రజల నుంచి ఎవరు వేరు చేయలేరని అన్నారు. తన మార్పు విషయమై పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు తనతో మాట్లాడలేదన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలే తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.

భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తనను సొంత బిడ్డలా చూసుకున్నారని ఆమె అన్నారు. తెరాస సెక్రటరీ జనరల్ పదవికి తనంతట తానే రాజీనామా చేశానన్నారు. ఆ పదవిని తెలంగాణ సీనియర్ నేత కె కేశవ రావుకు ఇవ్వడం మంచిదేనని విజయశాంతి అన్నారు.

కాగా, ఈ రోజు విజయశాంతి జన్మదినం కావడంతో ఆమె హైదరాబాదు చర్లపల్లిలోని స్ఫూర్తి ఫౌండేషన్ అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఆనందం కలిగించిందన్నారు. అశ్రమంలోని విద్యార్థులకు ఆమె వస్తువులను అందచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+