ఏమీ లేదు, నేనొచ్చి 3 రోజులే: తెలంగాణపై దిగ్విజయ్

తెలంగాణ ఏర్పాటవుతోందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని ప్రస్తావించగా.. 'ఆ సమాచారం ఎవరిచ్చారు?' అని ప్రశ్నించారు. మీ పార్టీ నాయకులేనని మీడియా ప్రతినిధులు చెప్పగా.. 'అవునా.. అయితే వారి పేర్లు చెప్పు' అని అడిగారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను ఎలా బయటపెడతామని విలేకరులు స్పష్టం చేయడంతో 'మీరు వదంతులను నమ్ముతారా?' అని ఆయన అన్నారు.
నమ్మబోమని, కాబట్టే వాస్తవం చెప్పండని అడగ్గా.. "నేను 28వ తేదీ రాత్రి హైదరాబాద్ వస్తున్నాను. 29వ తేదీ మొత్తం అక్కడే ఉంటాను. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుస్తాను. 30న విశాఖపట్నంలో ఫంక్షన్లు ఉన్నాయి. వాటికి హాజరయ్యేందుకు వెళతాను. ఇదీ నా కార్యక్రమం'' అని చెప్పారు. తెలంగాణ సంగతి ఏమిటని అడగ్గా.. "ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంశం'' అని జవాబిచ్చారు. తాను రాష్ట్ర బాధ్యతలు తీసుకుని మూడు రోజులు మాత్రమే అవుతోందని ఆయన అన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై రకరకాల వార్తలు వస్తున్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని కోరగా.. 'మేమేం ఇవ్వటం లేదు. మీరే ఇస్తున్నారు వార్తలు' అని అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకునే దిశగా పార్టీలో ఏమైనా కదలిక ఉందా? అని ప్రశ్నించగా.. "నాకైతే తెలీదు. నేను కూడా టీవీల్లోనే చూస్తున్నా'' అని అన్నారు.












Click it and Unblock the Notifications