కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రాయల తెలంగాణ'పై బైరెడ్డి ఫైర్, మేలేనని మంత్రుల్లో...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhar Reddy
హైదరాబాద్/కర్నూలు: రాయలసీమను ముక్కలు చేస్తే పార్టీలను సీమ ప్రజలు భూస్థాపితం చేస్తారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం అన్నారు. త్యాగాలకు, పోరాటాలకు నిలయమైన రాయలసీమను విభజిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. రాయల తెలంగాణ, రాయల ఆంధ్రాగా మార్చాలని చూడటం సరికాదన్నారు.

రాయల తెలంగాణపై ప్రచారం జరుగుతుండటంతో ఆయన తన ట్రాక్టరు యాత్రను నిలిపివేశారు. జూలై 4న హైదరాబాదులో 52 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. తమ సీమలో ఉన్న 52 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి గంట చొప్పున 52 గంటలు ఈ దీక్ష ఉంటుందని బైరెడ్డి చెప్పారు.

రాయల తెలంగాణపై మంత్రుల్లో....

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో స్పష్టమైన విధాన ప్రకటన చేయవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటైతే రెండు రాష్ట్రాల్లోని సమీకరణాలు తమకు అనూకూలిస్తాయని కొందరు కాంగ్రెసు నేతలు విశ్లేషిస్తున్నారు. తెరాస, బిజెపి వంటి పార్టీలు రాయల తెలంగాణకు విముఖంగా ఉన్నా... సీమలోని రెండు జిల్లాల్ని తెలంగాణలో కలపడం ద్వారా వివిధ రూపాల్లో కాంగ్రెసుకు అనుకూల స్థితి ఏర్పడుతుందని వీరు అంచనా వేస్తున్నారు.

రెండు జిల్లాల్ని కలిపి తెలంగాణ ఇచ్చినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెసు పార్టీయే కాబట్టి తమకు లాభిస్తుందని కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారట. రాయల తెలంగాణ అయితే ఇటు రెడ్డి, అటు కాపు ఓట్ల ద్వారా రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెసు పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారట. పలువురు తెలంగాణ మంత్రుల్లోను ఈ వాదన వినిపిస్తోందని అంటున్నారు.

English summary
Rayalaseema Parirakshana Samithi founder Byreddy Rajasekhar Reddy on Wednesday said that Rayalaseema will burn if Rayala Telangana is created.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X