విజయమ్మకు షాకిచ్చిన తెలంగాణవాదులు, గాయాలు

ఇందులో భాగంగా శుక్రవారం ఆమె తెలంగాణ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఈ సమయంలో పలువురు తెలంగాణవాదులు విజయమ్మను రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ బస్ డిపో వద్ద అడ్డుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. విజయమ్మ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తెలంగాణవాదులను అక్కడి నుండి తప్పించే ప్రయత్నాలు చేశారు.
దీంతో తెలంగాణవాదులు, విజయమ్మ భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విజయమ్మ భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.
తెలుగువారి ఆత్మగౌరవం పణంగా పెట్టారు: కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సోనియా గాంధీ అపాయింటుమెంటు దొరకకపోవడం శోచనీయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా వద్ద పణంగా పెట్టారని ఆయన ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications