వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటల్లో చెప్పలేని బాబు, కూలిన మరో చాపర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్/హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరదల్లో సహాయ చర్యలు చేపడుతున్న మరో హెలికాప్టర్ శుక్రవారం కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాలేదు. హార్సిల్ ప్రాంతంలో పవన్ హాన్స్ అనే హెలికాప్టర్ కిందకు దిగుతూ భూమిని ఢీకొంది. సహాయక సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఈ నెల 25వ తేదిన ఓ హెలికాప్టర్ కూలి ఇరవై మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

షిండే, చిరంజీవి సమీక్ష

భారీ వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్ పునర్ నిర్మాణం కోసం పర్యాటక శాఖ రూ.195 కోట్లు కేటాయించిందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. శుక్రవారం ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో కలిసి ఉత్తరాఖండ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన షిండే అనంతరం మీడియాతో మాట్లాడారు.

అన్ని శాఖల సహకారంతో ఉత్తరాఖండ్‌ను పునర్ నిర్మాస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడమే తమ మొదటి కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని షిండే వెల్లడించారు.

మాటల్లో చెప్పలేనన్న చంద్రబాబు

ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగు బాధితుల పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఘటన తనను చాలా బాధించిందన్నారు. ఎపి భవన్ తెలుగు వారి కోసం కట్టిందేనని అన్నారు. చార్ ధామ్ యాత్రికులు నరక అనుభవించారని, వారి బాధలను మాటల్లో చెప్పలేమన్నారు. తాను మానవతా దృక్ఫథంతో ఆదుకునే ప్రయత్నాలు చేశానని చెప్పారు.

డెహ్రాడూన్‌లో చిరు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శుక్రవారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిసి ఉత్తరాఖండ్ వరదలను సమీక్షించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ నుండి ఉత్తరాఖండ్‌కు రూ.195 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారిని ఆదుకోవడంలో మన ప్రభుత్వం విఫలమైందని, యాత్రికుల బాధలను మాటల్లో చెప్పలేనన్నారు.

సహాయ చర్యలు

ఉత్తరాఖండ్‌లోని భక్తులను హెలికాప్టర్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం. ఒక్కచోట కూర్చున్న వరద బాధితులు.

సహాయ చర్యలు

ఉత్తరాఖండ్‌లోని భక్తులను హెలికాప్టర్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం. ఒక్కచోట కూర్చున్న వరద బాధితులు.

సైనికులకు సలామ్

ఓ హెలికాప్టర్ నుండి ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం అవసరమైన సామాగ్రిని తీసుకు వెళ్తున్న సైనికులు.

విమానంలోని సైనికులు

గౌరికుండ్‌లో కూలిన ఎంఐ 17 వి5 హెలికాప్టర్‌లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ వీర జవాన్లు

చాపర్ కూలిన ప్రాంతం

ఉత్తరాఖండ్ వరదల్లో సహాయ చర్యలు చేపడుతున్న ఎంఐ 17 చాపర్ కూలిన ప్రాంతం

రక్షించే పనిలో సైన్యం

ఉత్తరాఖండ్ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వచ్చిన హెలికాప్టర్. తాడు సహాయంతో కిందకు దిగుతున్న సైనికుడు.

వీర జవాన్

ఉత్తరాఖండ్ వరద బాధిత సహాయ చర్యల్లో భాగంగా కూలిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ ప్రవీణ్.

బయటపడ్డారు

కేదార్ నాథ్, గుప్తకాశీలో చిక్కుకున్న వరద బాధితులను రక్షించిన సైన్యం. వారంతా ఒకచోట ఉన్న దృశ్యం

English summary
After an Indian Air Force (IAF) chopper, now another helicopter crashes in flood-ravaged Uttarakhand on Friday, June 28. The Pawan Hans helicopter crashed at Harsil in the hill state. No casualty has been reported so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X