రాయల తెలంగాణపై ఫైర్: ప్రత్యేక రాయలసీమ సీమ వేడి

Rayala telangana
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దపడిందనే సంకేతాలు బలంగా అందుతున్న నేపధ్యంలో రాయలసీమ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ఓ వైపు కోరుతూనే మరోవైపు ప్రత్యేక రాయలసీమ వాదాన్ని మెల్లగా తెర మీదికి తీసుకువస్తున్నారు. ప్రత్యేక రాయలసీమ కావాలంటూ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది.

ఆయన దీక్షకు పార్టీలకు అతీతంగా రాయలసీమ నాయకుల నుండి మద్దతు లభిస్తోంది. కాంగ్రెసుక చెందిన తులసిరెడ్డి ఆయన దీక్షకు శుక్రవారం మద్దతు ప్రకటించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే రాయలసీమ ఆస్తిత్వాన్ని కోల్పోతుందని ఆ ప్రాంతానికి చెందిన నాయకులతో పాటు మేధావులు కూడా విమర్శిస్తున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి కూడా వ్యతిరేకించారు. తమ పార్టీని బలహీన పరచడానికి ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని ఆమె ఆరోపించారు.

కాగా, రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన 52 గంటల దీక్ష రెండో రోజైన శుక్రవారం ఎమ్మార్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దీక్షా స్దలి వద్దకు చేరుకోని బైరెడ్డిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. వెయ్యి మంది సోనియాలు, లక్ష మంది దిగ్విజయ్‌లు వచ్చినా రాయలసీమ జిల్లాలను విడగొట్టలేరన్నారు.

కాంగ్రెసు హైకమాండ్ రాయలసీమ జిల్లాలను విభజించాలని చూస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోరు విప్పడం లేదని మందకృష్ణ తీవ్రస్దాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షణాలు చేస్తు.. తన పదవిని కాపాడుకోవడానికే సమయం సరిపోతుందని అన్నారు. రాయలసీమ జిల్లాల విభజనపై రిఫరెండం పెట్టాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. సీమ జిల్లాల విభజనపై నోరు విప్పని 52 మంది ఎమ్మేల్యేలకు రాయలసీమ ప్రజలు సమాధి కడతారని ఆయన హెచ్చరించారు.

ఇది ఇలా ఉంటే.. మరో వైపు సమైక్యాంధ్ర కోసం కోస్దాంధ్ర రాజకీయ నాయకులతో కలిసి రాయలసీమ నాయకులు పని చేస్తున్నారు. కాంగ్రెసు పార్లమెంట్ సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి వంటి నాయకులు సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద, రాయల తెలంగాణ ప్రతిపాదనపై పెద్దయెత్తున, మరోవైపు సమైక్యాంధ్ర కోసం కోస్తాంధ్ర రాజకీయ నాయకులతో కలిసి రాయలసీమ నాయకులు పనిచేస్తున్నారు. ఐతే తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం పెద్దగా ముందుకు రావడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+