తెరాస కనుమరుగవుతుంది: ఎర్రబెల్లి, కెసిఆర్‌పై ఫైర్

Errabelli Dayakar Rao
వరంగల్: రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కనుమరుగవడం ఖాయమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకల జనుల సమ్మె కొనసాగి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. అనుకూల ప్రకటన వచ్చే సమయానికి కెసిఆర్ ఢిల్లీలో రూ.500 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

అటు సమ్మెను, ఇటు ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆరోపించారు. కేసీఆర్ ఏ మీటింగ్‌లోనూ సోనియాను విమర్శించలేదని , దానికి కారణమేంటో అందరికీ తెలుసన్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకువచ్చి మంత్రి పదవి వచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేసింది తానే అని చెప్పుకున్నారు. అలాంటి శ్రీహరి విశ్వాసం లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ నెల 7వ తేదీ ప్రాంతీయ సభా ప్రాంగణాన్ని తెలుగుదేశ జిల్లా నేతలు శుక్రవారం సాయంత్రం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లన్నీ శనివారం మధ్యాహ్నానికే పూర్తవుతాయని చెప్పారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ఎర్రబెల్లి చెప్పారు.

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలుత సభా ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని అవిష్కరిస్తారని, అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేస్తారని చెప్పారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తారని, చార్‌ధామ్ మృతులకు సంతాపం ప్రకటిస్తారని తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు రానున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అందుకు పార్టీ శ్రేణులు చేయవలసిన కృషిపై సభలో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+