నిర్మాత బండ్ల గణేష్ పౌల్ట్రీలో బాలికపై అత్యాచారం

పోలీసులు అందించిన వివరాల ప్రకారం - మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం తిమ్మాజిపల్లి తండా సమీపంలోని పరమేశ్వర పౌల్ట్లీలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. వీరు మూడు రోజుల క్రితం పని మీద సొంత ఊరికి వెళ్లారు. వారి చిన్న కూతురు ఇక్కడే ఉంది.
ఆ బాలిక ఈ నెల 9వ తేదీన పౌల్ట్లీలో గుడ్లు తీస్తుండగా అక్కడే పనిచేసే ఉద్యోగి శ్రీను ఆ బాలికను మరో షెడ్లో గుడ్లు తీయాలని తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications