గోవాలో కాసినో షిప్ నుంచి పడి ఆంధ్రుడి గల్లంతు

కాసినో కార్నివాల్ నడుపుతున్న ఓడ ఎంవి బోవా సార్టే నుంచి ధనుష్ సాయి అనే 20 యేళ్ల యువకుడు పడిపోయాడు. అతని ఆచూకీ తెలియడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రక్షిత చర్యలను చేపట్టినట్లు కాసినో యాజమాన్యం తెలిపింది.
ధునుష్ మరో ఇద్దరు మిత్రులతో కలిసి గోవాకు విహార యాత్రకు వెళ్లాడు. ఆదివారంనాడు పానాజీ వద్ద గల కాసినో షిప్ చూడడానికి వెళ్లాడు. పడవ రెండో స్థాయి నుంచి జారి ధనుష్ పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వర్షం పడుతుండడంతో ప్రాంతమంతా జారుతోందని అన్నారు. అతన్ని పట్టుకోవడానికి అతని మిత్రుడు దుమికాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.
గజ ఈతగాళ్లను రంగంలోకి దింపామని, అయినా అతని జాడ తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. తమ సంస్థ ఉద్యోగులు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని సంస్థ సోమవారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications