యుటిగా హైదరాబాద్ పుకారే, చెప్పం: దిగ్విజయ్

గుంటూరు జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, రాష్ట్ర మంత్రి మాణిక్యవర ప్రసాద్ మంగళవారం దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. వీరి భేటీ తర్వాత దిగ్విజయ్ సింగ్ మీడియాతో ఆ మాటలు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడానికి తాము దిగ్విజయ్ సింగ్‌ను కలిసినట్లు రాయపాటి సాంబశివ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రాష్ట్రాన్ని విడగొడితే నష్టపోతామని తాము దిగ్విజయ్ సింగ్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ చేపడుతామని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ సంతకాల సేకరణ జరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కూడా సంతకాలు సేకరిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప తమకు రెండో ఆలోచన లేదని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం రెండో ఆలోచన చేస్తే అని మీడియా ప్రతినిధులు అంటే రెండో ఆలోచన తమకు ఇష్టం లేదని రాయపాటి అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ అభిప్రాయానికి భిన్నంగా పార్టీ అధిష్టానం వ్యవహరిస్తే ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తామని అన్నారు. విషయాన్ని వర్కింగ్ కమిటీకి నివేదించామని దిగ్వజియ్ సింగ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర మెజారిటీ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తుందని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలతో పోలిస్తే తెలంగాణ ప్రజలు మైనారిటీ అవుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications