మ్యాచ్ ఫిక్సింగ్ పంచాయతీ: వారి కొంపముంచుతోందా?

 Match fixing in Panchayat Elections
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలలో పొత్తులు ఆయా పార్టీలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవయినప్పటికీ, పార్టీల హవానే కొనసాగుతోంది. తాజాగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.... ఇలా అన్ని పార్టీలు పలుచోట్ల ఒకరితో ఒకరు పొత్తులు పెట్టుకున్నారు.

ఎక్కువగా కాంగ్రెస్ - వైయస్సార్ కాంగ్రెసు, ఆ తర్వాత టిడిపితో ఆ రెండు పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్నాయి. అయితే ఈ పొత్తులు ఆయా పార్టీలకు నష్టాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా ఉండే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ దెబ్బతినే పరిస్థితి మరింత వచ్చిందంటున్నారు. ఈ జిల్లాలో పలు స్థానాలలో కాంగ్రెసు, టిడిపి మద్దతుదారులు ఒకే అభ్యర్థిని నిలబెట్టారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు నారాయణ రెడ్డి సోదరులిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి మద్దతుదార్లను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారట. రాయచోటి నియోజకవర్గంలో పలుచోట్ల టిడిపి నేతలు కాంగ్రెసు పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. మైదుకూరు, బద్వేలు, రాజంపేట తదితర జిల్లాల్లో పార్టీలు పలుచోట్ల పొత్తులతో వెళ్తున్నాయి.

దీంతో అన్ని పార్టీలు నష్టపోతున్నాయంటున్నారు. కడప జిల్లాలో వైయస్ కుటుంబానిదే హవా. కానీ చాలా ఏళ్ల తర్వాత ఆ ఇలాకాలో టిడిపి అభ్యర్థి సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో టిడిపి బలంగా ఉంది. అయితే ఈ పొత్తు కారణంగా అక్కడ వీక్ అయ్యే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇక్కడే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పొత్తులు ఆయా పార్టీల కోటలకు బీటలు వారేలా చేస్తున్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+