సిటీలో మరో ఘోర ప్రమాదం: గోడ కూలి 5గురు మృతి

Fence Wall collapsed
హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మౌలాలి డివిజన్ పరిధిలోని ఎంజె కాలనీలో ఒక కాంప్లెక్స్ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటన మంగళవారం వేకువజామున జరిగింది. ఆ గోడ పక్కనే ఉన్న పూరిళ్ల పైన పడింది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

మహబూబ్ నగర్ జిల్లాకు చందిన వెంకటయ్య, మహదేవ్‌ కుటుంబాలు స్థానికంగా గుడిసెలు వేసుకొని కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తన్నారు. వర్షాల కారణంగా పక్కనే ఉన్న గోడ నాని కూలి వారి ఇళ్ల పైన పడింది. వెంకటయ్య, మహదేవ్, పద్మ, ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద పడి మృతి చెందారు.

శిథిలాల కింద చిక్కున్న లిల్లీ అనే చిన్నారని కాపాడారు. మరో చిన్నారి శిథిలాల కిందే ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఆరు గంటల అనంతరం రక్షించారు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

ప్రమాద ఘటనను ఎంపి సర్వే సత్యనారాయణ, మంత్రి రఘువీరా రెడ్డి పరిశీలించారు. క్షేమంగా బయటపడ్డ చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని రఘువీరా చెప్పారు. మహదేవ్ కుటుంబానికి రూ.8.5 లక్షలు, వెంకటయ్య కుటుంబానికి రూ.6.5 లక్షళ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కాగా ఇటీవలే సికింద్రాబాదులో ఓ హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 18 మంది వరకు మృతి చెందారు. అది మరువక ముందే జంట నగరాలలో ఘోర ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+