మేం గెలిచాం: చంద్రబాబు మొహంలో పంచాయతీ నవ్వు

ఇటీవలి వరకు రాష్ట్రంలో టిడిపి పరిస్థితి ఆశాజనకంగా ఏమాత్రం లేదు. 2009 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర తర్వాత పార్టీ క్రమంగా పట్టు సాధించడం ప్రారంభించింది. త్వరలో బాబు బస్సుయాత్ర కూడా చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో టిడిపి ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి ఆ పార్టీలు తమ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారని చెబుతున్నారు. సర్పంచు ఎన్నికలు పార్టీ రహితమైనవి కావడంతో కచ్చితంగా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో చెప్పలేనప్పటికీ... టిడిపి మాత్రం మంచి ఫలితాలను సాధించింది. తెలంగాణలోను పలు జిల్లాల్లో టిడిపి సత్తా చాటింది.
దీంతో చంద్రబాబు హాయిగా నవ్వుతూ కనిపించారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మండిపడిన చంద్రబాబు.. ఎక్కువగా నవ్వుతూనే కనిపించారు. జగన్ పైన, కాంగ్రెసు పైన సీరియస్‌గా విమర్శలు చేసినప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడారు.












Click it and Unblock the Notifications