ఎక్కువ ఊహించుకున్నారు, జగన్ సస్పెన్షన్ ఏది: బాబు

రాష్ట్ర ఆదాయం పెరిగింది కానీ అభివృద్ధి జరగలేదన్నారు. అవినీతిపై పోరాడేందుకు ఇప్పుడు యువత ముందుకు వస్తోందన్నారు. తమ పార్టీ బలం కార్యకర్తలేనని మరోసారి పంచాయతీ ఎన్నికల ద్వారా రుజువయిందన్నారు. అభివృద్ధికి అవినీతి అడ్డుగా మారిందన్నారు. సుపరిపాలన, సుస్థిర పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల ద్వారా కొన్ని లెసన్స్ వచ్చాయన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరాచక, అబద్దాల, అసత్యాల పార్టీ అని మండిపడ్డారు. 2275 స్థానాల్లో గెలుపొందినట్లుగా సాక్షిలో వచ్చిందని, అబద్దాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అబద్దాలు చెప్పేందుకు కూడా సిగ్గుపడటం లేదన్నారు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రపంచంలో కనీవినీ ఎరగని అవినీతి రాష్ట్రంలో జరిగిందని, అందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే బాధ్యులన్నారు.
జగన్ పార్టీ నేతలు ఎటిఎం దొంగతనాల్లో, దొంగనోట్ల వ్యవహారంలో.. ఇలా పలు కేసుల్లో ఉన్నారన్నారు. సిద్ధార్థ రెడ్డి పైన ఆరోపణలు వస్తే సస్పెండ్ చేసిన పార్టీ జగన్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వారి పైన కేవలం ఆరోపణలే వచ్చాయని, జగన్ పైన ఛార్జీషీట్ వేసి, జైలుకు కూడా పంపించారని అయినా సస్పెండ్ చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టిందే అవినీతి కాంగ్రెసు నుండి అన్నారు.
ఆ పార్టీ చరిత్ర అరాచకాలు, మారణ హోమమే అన్నారు. కడపలో ఎన్ని ఘోరాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. అక్కడ ఇప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించునే పరిస్థితి లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ డాన్ అని విమర్శించారు. పలు జిల్లాల్లో టిడిపి వెనుకుండడానికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications