బాబునే కోరుకుంటున్నారు: కోడెల, దమ్ముందా: దేవినేని

తొలి దశ ఎన్నికల ఫలితాలా ఆధారంగా తటస్థ ఓటర్లు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారు ఇకపై జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పక్షానే నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినందు వల్లే కొన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచిందన్నారు.
దేవినేని సవాల్
తొలి దశ పంచాయతీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు ఎక్కువ స్థానాలు గెలుపొందినట్లుగా చెబుతున్నారని, అదే నిజమైతే జాబితా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సవాల్ చేశారు.
తమ పార్టీ మద్దతుదారులతో పాటు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఇరవై మంది స్వతంత్ర సర్పంచుల జాబితాను దేవినేని విడుదల చేశారు. వైయస్సార్, కాంగ్రెసు పార్టీలు కూడా తమకు దమ్ముంటే జాబితాను విడుదల చేయాలని సవాల్ చేశారు. 20 మంది స్వతంత్రులతో సహా 135మంది జాబితాను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications