విజయమ్మ థ్యాంక్స్: సిఎం సవాల్, కెసిఆర్ కోటలో జగన్

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం, తొలి విడత ఫలితాలు కలిపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2310 స్థానాల్లో, కాంగ్రెసు 2162 స్థానాల్లో, టిడిపి 2015 స్థానాల్లో, తెరాస 534 స్థానాల్లో గెలుపొందిందని సాక్షి పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియోజకవర్గంలో, మంత్రి శ్రీధర్ బాబు సొంతూళ్లో జగన్ పార్టీ మద్దతుదారులే గెలుపొందారు.
కోడ్ ఉల్లంఘించారు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆ పార్టీ నేత షర్మిలలు పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ నేత అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. వీరిద్దరు మంగళవారం తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారని, సాక్షి టివి, పత్రికలలో ఇవి ప్రచురించారన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రాశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జగన్ పార్టీకి సిఎం రమేష్ సవాల్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని ఆ పార్టీ ఎంపి సిఎం రమేష్ అన్నారు. తామే ఎక్కువ స్థానాల్లో గెలుపొందామని చెబుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పంచాయతీ సర్పంచుల వివరాలు బయటపెట్టగలదా అని సవాల్ విసిరారు. తాము తమ మద్దతుదారుల వివరాలు బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కిందపడినా తమదే పైచేయి అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications