మేమే నెం.1: మైసూరా, బాబు పరిస్థితి తెలుసు: కొండ్రు

ఈ ఎన్నికలు తమకు కొలబద్ద కాదన్నారు. తాము మసిపూసి మారేడుకాయ చేసే రకం కాదన్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల ద్వారా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో తాము ఇప్పటికీ నెంబర్ వన్ అని, ప్రజల మద్దతు తమకే ఉందన్నారు. స్తానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. సర్వేలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పరపతి పడిపోయిందని చెప్పిన సర్వేలు.. అదే పార్టీ నెంబర్ వన్ అంటూ చెప్పడం ఎలా సాధ్యమన్నారు.
కాంగ్రెసు మెజార్టీ స్థానాలు గెలుస్తుంది: రౌతు
మూడు విడతల పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీయే ఆధిక్యంలో నిలుస్తుందని కాంగ్రెసు ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు అన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో టిడిపి స్వల్ప ఆధిక్యంలో ఉందని, అయినా ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్సే ముందుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో తక్కువ స్థానాలు వచ్చాయని విమర్శించడం సరికాదన్నారు.
బాబు పరిస్థితేంటో సర్వేలు చెబుతున్నాయి: కొండ్రు
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో జాతీయ సర్వేలు చెబుతున్నాయని మంత్రి కొండ్రు మురళి అన్నారు. బాబుకు గోబెల్స్ ప్రచారం అలవాటే అన్నారు. 2004, 2009కు ముందు కూడా ఇలాగే ప్రచారం చేశారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచింది తమ వారే అన్నారు.












Click it and Unblock the Notifications