వైయస్ జగన్ ఆస్తుల కేసు: మరో అధికారికి ఉచ్చు

కడప జిల్లా ఈశ్వరీ సిమెంట్సుకు నిబంధనలకు విరుద్ధంగా ప్రాస్పెక్టివ్ లైసెన్స్ ఇవ్వడం, దాని ఆధారంగా సున్నపురాయి గనులకు లీజు జారీ, వాటిని తర్వాత దాల్మియా సిమెంట్‌కు బదలాయించడం జరిగిందని, అందులో గనుల శాఖలో సంబంధమున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని గతంలో సిబిఐ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో రాజగోపాల్, శ్రీలక్ష్మిలను సిబిఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అప్పుడు గనుల శాఖ సంచాలకుల కార్యాలయంలో జెడిగా ఉన్న అధికారి తర్వాత పదోన్నతి వచ్చి ప్రస్తుతం సంచాలకుడిగా పని చేస్తన్నారు.
కడప జిల్లా తల్లమంచిపట్నం, నవాబుపేట గ్రామాల్లోని భూమిని సున్నపురాయి గనుల లీజు కోసం జయ మినరల్స్ అనే కంపెనీకి ప్రాస్పెక్టివ్ లైసెన్సును ఇస్తూ పరిశ్రమల శాఖ 2006లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లైసెన్సును మూడు నెలల్లో ఈశ్వరీ సిమెంట్స్ పేరుతో బదలాయించాలని ఈ ఉత్తర్వులోనే నిబంధన పెట్టారు.
కాగా అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. ఇదే కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, శ్రీలక్ష్మి, రాజగోపాల్ తదితరులు అరెస్టైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications