వారి వెనుక కిరణ్: హరీష్, తెలంగాణపై కావూరి సైలెన్స్

తెలంగాణపై కావూరి సైలెన్స్
కేంద్ర జౌళీ శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు గురువారం తెలంగాణపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగామలో సిల్క్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. గుంటూరులో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, ఎపిలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆ సమయంలో తెలంగాణపై ప్రశ్నించగా.. మాట్లాడేందుకు నిరాకరించారు.
మాకు కావాల్సింది అదే: దేవీప్రసాద్
సీమాంధ్ర మంత్రుల వల్లనే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ హైదరాబాదులో అన్నారు. సీమాంధ్రులు లేని ప్రభుత్వమే తమకు కావాలన్నారు. తమకు కావాల్సింది వారే నెరవేరుస్తుంటే తమకు ఇంకా అభ్యంతరమేముందని రాజీనామా చేస్తానన్న సీమాంధ్ర మంత్రులను ఉద్దేశించి అన్నారు. రాజీనామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
త్వరలో నిర్ణయం: పొన్నాల
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లాలో అన్నారు. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications