విభజించొద్దు: సోనియాకు జగ్గారెడ్డి, జై తెలంగాణ అంటే...

Jagga Reddy
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని, విభజిస్తే తెలంగాణ ప్రాంతానికి నష్టమేనని ప్రభుత్వ చీఫ్ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను శవ రాజకీయాలు చేయడం లేదని, కొన్ని పార్టీలు అలా చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే మెదక్ జిల్లాకు న్యాయం జరగలేదని, తెలంగాణ వస్తే ఇక అసలే జరగదన్నారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమైక్యంగానే ఉంచాలన్నారు.

తెలంగాణకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని చెబుతున్న నేతలు వారే లబ్ధి పొందుతున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి లాభం జరగడం లేదన్నారు. నష్టం జరిగిందని చెప్పి రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎపిని యథాతథంగా ఉంచాలన్నారు. విభజనతో ప్రధానంగా మెదక్ జిల్లాకు ఎలాంటి లాభం లేదన్నారు. జై తెలంగాణ అంటే ఇప్పుడు పూలు పడినా.. తెలంగాణ చరిత్ర మాత్రం వారిని క్షమించదన్నారు.

తెలంగాణకు రూ.25 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తే చాలన్నారు. కేవలం 10 శాతం మందే తెలంగాణ కోరుకుంటున్నారన్నారు.తనది రాజకీయ అజెండా కాదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని కానీ, ప్రజల కోసం తాను మాట్లాడక తప్పదన్నారు. చనిపోయిన వారితో రాజకీయం చేస్తున్న వారు మృతుల కుటుంబాలను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో అమరవీరులు చనిపోతే తాను ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చానన్నారు. తెరాసలా తాను వసూళ్లు చేసి ఇవ్వలేదన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తనకు వ్యక్తిగతంగా వచ్చే లాభమేమీ లేదన్నారు. రాజకీయంగా తనకు నష్టమే అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలని తాను నుకుంటే.. ఉద్రేకాలు రెచ్చగొట్టే వారిలా తాను కూడా నలుగురితో పాటు తెలంగాణ కోసం గళమెత్తవచ్చునని, అప్పుడు తనకే లాభం చేకూరుతుందన్నారు. తాను నిజాలు చెబుతున్నానని, దీనిని అందరూ గుర్తించాలని కోరారు. కొందరు నాయకులు ఇదే అజెండాతో బతుకుతున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+