విభజిస్తే ఎంతకైనా తెగిస్తాం: జగన్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి

Srikanth Reddy
హైదరాబాద్/కడప: విభజిస్తే ఎంతకైనా తెగిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గురువారం హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు అప్రమత్తమయ్యారు. నిన్న సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ రోజు వీరశివా రెడ్డి రాజీనామా చేశారు. పలువురు పలువురు నేతలు సమైక్య గళం అందుకున్నారు.

రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించవద్దన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు. రాష్ట్రాన్ని, రాయలసీమను విభజించే హక్కు కాంగ్రెసు పార్టీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విభజన విషయంలో నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీల నిర్ణయం అవసరం లేదా అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో కేంద్రం ఆటలు ఆడుకుంటోందని ఆరోపించారు.

విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర మంత్రులు చెప్పడం ఓ డ్రామా మాత్రమే అన్నారు. ఆ నేతలకు సమైక్య రాష్ట్రంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తెలంగాణ ఇస్తామంటే అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అధిష్టానం చెప్పిన మాట వింటామని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు చెబుతున్నారని, అధిష్టానమేమో తన రాజకీయ అవసరాల కోసం చూస్తోందని మండిపడ్డారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేయవద్దన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చానని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+