తెలంగాణ ఎఫెక్ట్: పదవికి, పార్టీకి వీరశివారెడ్డి రాజీనామా

సమైక్యవాదం వినిపిస్తాం: శైలజానాథ్
సమైక్యవాదాన్ని మరోసారి బలంగా వినిపించేందుకే తాము ఢిల్లీ వెళ్తున్నామని మంత్రి శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. మంత్రులెవరూ రాజీనామా చేస్తామని చెప్పలేదని ఆయన అన్నారు. అయితే కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉంటామని మాత్రమే అన్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఢిల్లీ స్థాయిలో పార్లమెంటు సభ్యులు కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధం: కోమటిరెడ్డి
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండలో మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నాయకులను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications