చెప్పడానికేం లేదు: టిపై బాబు, సర్వే భావన, విన్ నిజం

Chandrababu Naidu
హైదరాబాద్: విభజన విషయంలో తాము చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. రాష్ట్ర విభజన పరిణామాల పైన బాబు ఆచితూచి స్పందించారు. మిగిలిన పార్టీలు తమ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నాలు చేశాయనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని, తాము అధికారంలో ఉన్నప్పుడు మంచి పాలన ఇచ్చామని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఒక గుర్తింపును తెచ్చామన్నారు.

ప్రజల్లో టిడిపి పట్ల ఉన్నసానుకూలకతకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన విషయంపై మాత్రం తాము ఎప్పుడో చెప్పామని, ఇక చెప్పడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. సర్వేల అంశం పైనా చంద్రబాబు స్పందించారు. సిఎన్ఎన్-ఐబిఎన్, హిందూల సంయుక్త సర్వే గురించి మాట్లాడుతూ... సర్వే అనేది ఒక భావన అని పంచాయతీ ఎన్నికలు మాత్రం నిజం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1600 ఓటర్లను వారు సర్వే చేశారని, అంటే నియోజకవర్గానికి సుమారుగా ఐదుగురు మాత్రమే అన్నారు.

కానీ తొలి విడత పంచాయతీ ఎన్నికలలో 1.40 కోట్ల మంది జనం ఓట్లు వేశారని, జనం ఎటువైపు ఉన్నారో ఆ ఫలితాలే చెప్పాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పైన వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

త్వరలో బస్సుయాత్ర

బస్సుయాత్ర చేపట్టి త్వరలోనే ప్రజల్లోకి వెళ్తానని చంద్రబాబు చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి పోరాడటంతో పాటు వారిని చైతన్యపరిచే ప్రయత్నాలు చేశానన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక బస్సు యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+