తిండి గొడవ: ముంబైలో రూ.12కే, ఢిల్లీలో రూ.5కే

వడా పావ్ కాదు, తగినంత అన్నం, దాల్ సాంబార్, కొన్ని కూరగాయలను కలిపి కూడా 12 రూపాయలకే భోజనం పెట్టించవచ్చనని ఆయన అన్నారు. రాజ్ బబ్బర్ వ్యాఖ్యలపై బిజెపి తీవ్రంగా ప్రతిస్పందించింది. అయితే, ఢిల్లీలో ఐదు రూపాయలకే సుష్టుగా తినేంత భోజనం పెట్టించవచ్చునని మరో కాంగ్రెసు నాయకుడు గురువారంనాడు అన్నారు
తనకు ముంబై గురించి తెలియదు గానీ ఢిల్లీలో ఐదు రూపాయలకే భోజనం చేయవచ్చునని, జమా మసీద్ వద్ద ఐదు రూపాయలకే భోజనం లభిస్తుందని కాంగ్రెసు నాయకుడు రషీద్ మసూద్ అన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదరికం 22 శాతం తగ్గిందని ప్రణాళికా సంఘం ఇచ్చిన నివేదికను సమర్థించడానికి కాంగ్రెసు నాయకులు ఆ ప్రకటన చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది.
దేశంలో పేదిరక తగ్గిందని ప్రణాళికా సంఘం చూపిన లెక్కలపై బిజెపి, సిపిఎం తీవ్రంగా మండిపడ్డాయి. ప్రభుత్వం వాస్తవాన్ని విస్మరిస్తోందని తప్పు పట్టాయి. కాంగ్రెసు మిత్రపక్షం కూడా పూర్తిగా ప్రణాళికా సంఘం నివేదికతో ఏకీభవించడం లేదు. యుపిఎ ప్రభుత్వం పేదలకు అనుకూలమైన విధానాలను అవలంబించడం వల్ల పేదరికం తగ్గిందని కాంగ్రెసు పార్టీ నాయకులు వాదిస్తున్నారు.
పేదరికం తగ్గిందని ప్రణాళిక సంఘం చెప్పడం పేదలకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలో భాగమని, సంక్షేమ పథకాలకు వారిని దూరం చేసే ఉద్దేశం ప్రణాళికా సంఘం నివేదికలో ఉందని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. రోజుకు 34 రూపాయల సంపాదనతో ఎలా జీవిస్తారో ఆయన కాంగ్రెసును అడిగారు.












Click it and Unblock the Notifications