ఢిల్లీ రేప్: మైనర్‌పై తీర్పు ఆగస్టు 5కు వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ నిందితుడిపై తీర్పును జువనైల్ జస్టిస్ బోర్డు (జెజెబి) వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేసింది. మైనర్‌పై తీర్పును నిజానికి జులై 11వ తేదీననే వెలువరించాల్సి ఉండింది. దాన్ని గురువారానికి వాయిదా వేసింది. తిరిగి ఆ తీర్పును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.
నిరుడు డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసింది. నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఆ మైనర్‌పై తీర్పును ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసినట్లు జెజెబి డిఫెన్స్ న్యాయవాది రాజేష్ తివారీ చెప్పారు.

సంఘటన జరిగినప్పుడు నిందితుడైన బాలుడికి 17 ఏళ్ల ఆరు నెలల వయస్సు ఉంది. ఇప్పుడు అతనికి 18 ఏళ్ల వయస్సు వచ్చింది. జువెనైల్ హోంలో విచారణలో ఉన్న సమయంతో కలిపి అతను మూడేళ్లు ఉండాల్సి వస్తుంది. ఈ మైనర్ బాలుడు దోపిడీ కేసులోనూ దోషిగా తేలాడు. ఈ కేసులో కూడా అతనికి శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఈ కేసులో కూడా శిక్ష ఖరారును జెజెపి ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
జువనైల్ పరధిని తాజాగా అన్వయించాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి కోరిన నేపథ్యంలో జెజెపి మైనర్ బాలుడిపై తీర్పును వాయిదా వేసింది. సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌పై విచారణకు అంగీకరిస్తూ పిటిషన్ తమ వద్ద పెండింగులో ఉన్న విషయాన్ని జెజెబికి తెలియజేయాలని ఈ నెల 23వ తేదీన ఆదేశించింది. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ జులై 31వ తేదీన విచారణకు వస్తుంది.
వయోపరిమితిని 18 ఏళ్లకు నిర్ధారించడానికి బదులు మానసిక, బౌద్దికపరమైన మాచ్యురిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు.












Click it and Unblock the Notifications