నీళ్లు నిలిచి ఆగిన రైలు, వరదలో పిల్లల ఆట(పిక్చర్స్)
హైదరాబాద్/అహ్మదాబాద్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన ఎగువ ప్రాంతాల్లో కురుస్తుండటంతో గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఒక్క రాత్రిలోనే పది అడుగులకు పెరిగింది. ప్రస్తుతం దాదాపు 56 అడుగుల వద్ద నిలకడగా ఉంది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పలుచోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కొన్ని గ్రామాలు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. గురువారం రాత్రి వరకు తెలంగాణలో ఒక మోస్తారు భారీ వర్షాలు, కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

అహ్మదాబాదులో..
భారీగా కురిసిన వర్షాలతో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదు పట్టణంలో రోడ్ల పైనే నిలిచిన నీరు. పట్టణంలోని హట్కేశ్వర్, కోక్రా, ఆమ్రవాడి, వాత్వా, నారోల్, సివిల్ ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

గుజరాత్‌లో....
భారీగా కురుస్తున్న వర్షాలకు గుజరాత్‌లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల పైన పూర్తిగా నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు వచ్చింది.

అహ్మదాబాదు
వర్షాల కారణంగా దుకాణాలు బంద్ పెట్టారు. కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. అహ్మదాబాదులోని ఓ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన నీరు. ఆటోల చక్రాలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి.

ట్రాఫిక్
వర్షాల కారణంగా రోడ్ల పైన నీరు నిలిచి పోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పలు ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూగా కనిపించాయి. గుజరాత్‌లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.

చిన్నారుల ఆనందం
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోడ్ల పైన నిలిచిన నీళ్లలో చిన్నారులు మాత్రం ఆడుతూ ఆనందిస్తున్నారు.

ట్రాక్ పైనే నీళ్లు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై మొత్తం తడిసి ముద్దయింది. ఓ ప్రాంతంలో పట్టాల పైకి నీరు చేరుకోవడంతో మధ్యలోనే నిలిచి పోయిన రైలు.

అంతా నీరే...
ఎగవ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలో నదులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ ప్రాంతంలో నీటితో నిండి పోయిన ఓ ప్రాంతం దృశ్యం.

తాలిపేరు ప్రాజెక్టు
ఖమ్మం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో గేట్లు తెరిచారు. మహబూబ్ నగర్ జిల్లా సుంకేశుల జలాశయం నుంచి కూడా 70వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలంలోని సుంకేశుల జలాశయం వద్ద ఇరవై గేట్లు ఎత్తివేశారు. తుంగభద్ర, శ్రీశైలం తదితర జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు నిండిపోయింది. దీంతో మొత్తం గేట్లు ఎత్తివేశారు.
ముంబై భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. వర్షాల కారణంగా పాఠశాలలు, ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 1.27 గంటలకు సముద్రంలో పోటు వస్తుందని, 5మీ. ఎత్తు వరకు అలలు ఎగసిపడవచ్చునని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ అప్రమత్తమైంది.












Click it and Unblock the Notifications