బిజెపికి పెరిగినా మోడీకి తగ్గింది, ఎపిలో కాంగ్ బలమదే

Modi wave in Gujarat: Survey
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో విపక్షాల అనైక్యతే అధికార కాంగ్రెసు పార్టీకి వరంగా మారనుందని సిఎన్ఎన్-ఐబిఎన్, హిందూ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2009లో చేసిన సర్వేతో పోల్చితే కాంగ్రెసు పరిస్థితి బాగా మారిందని తెలిపింది. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోకముందు చేసిన సర్వేలో కాంగ్రెసుకు 39 శాతం మద్దతు లభించింది. ఇప్పుడు 32 శాతానికి తగ్గినప్పటికీ .. మిగిలిన పార్టీలు అధికార పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నాయట.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇరవై శాతం, తెలుగుదేశం 17 శాతంతో నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వల్లనే టిడిపి మూడో స్థానానికి పరిమితమైందని పేర్కొంది. ఇక గుజరాత్, మహారాష్ట్రల్లో అధికార పార్టీలదే హవా అని తెలిపింది. అయితే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రజాదరణ కొద్దిగా తగ్గినట్లు పేర్కొంది. అయితే బిజెపికి గుజరాత్‌లో గత లోకసభ ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఏడు శాతం ఓట్లు పెరిగే అవకాశముంది.

గతంలో మోడీకి 49 శాతం ప్రజాదరణ ఉంటే.. ఇప్పుడు 44 శాతానికి పడిపోయింది. పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి గతంలో 72 శాతం ఉంటే, ఇప్పుడు 64 శాతంగా ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలన పట్ల 82 శాతం, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పాలన పట్ల 75 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మోడీ మాత్రం 64 శాతంతో ఏడో స్థానంలో నిలిచారు.

మహారాష్ట్రలో 2009లో 39శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 43శాతం ఓట్టు పొందే అవకాశం ఉంది. ఎంపీ స్థానాలు కూడా గరిష్ఠంగా 27 వరకు రావచ్చు. మహారాష్ట్రలో రాజ్ థాకరే కీలకంగా మారే అవకాశాలున్నాయి. 66 శాతం మంది కేంద్ర ప్రభుత్వం అవినీతికరమైనదని అన్నారు. యూపిఏ ప్రభుత్వం పట్ల గుజరాత్ ప్రభుత్వంలోనే ఎక్కువ సంతృప్తి వ్యక్తం కావడం గమనార్హం. మోడీ తర్వాత ఆయన సహచరుడు అమిత్ షాను ముఖ్యమంత్రికి తగిన వాడుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+