వేచిచూద్దాం: తెలంగాణపై దిగ్విజయ్ సింగ్

భేటీ అనంతరం ఏదో జరుగుతుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. జాతీయ మీడియా సైతం ఆసక్తి కనబర్చింది. డిగ్గీ ఓ స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా సస్పెన్స్‌కు తెర దించుతారని అందరూ భావించారు. అయితే ఆయన మాత్రం నిర్ణయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. విభజిస్తారా లేదా అనే అంశాన్ని ఈ రోజు చెప్పనప్పటికీ, సిడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు ఉంటుంది, నిర్ణయం ఎప్పటి లోపు తీసుకుంటారనే విషయం పైన ఆయన మాత్రం స్పందించలేదు.
డిగ్గీ ప్రకటన ఇటు తెలంగాణ నేతలకు అసంతృప్తిని మిగిల్చగా... సీమాంధ్ర నేతలలో మాత్రం ఉత్కంఠను కలిగిస్తోంది. ఆయన ప్రకటన ఇప్పుడు అందర్నీ కన్ఫ్యూజన్‌లో పడేసింది. అనుకున్నట్లుగానే ఈ నెలలో సిడబ్ల్యూసిలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సీమాంధ్రలో ఆందోళనలు
కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి శనివారం సీమాంధ్రలో ఆందోళనకు సిద్ధమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం కృష్ణా జిల్లాలో స్కూళ్లు, కళాశాల బందుకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications