త్వరలో టిపై నిర్ణయం: బొత్స, డ్రామాలొద్దని జగన్ పార్టీకి

తెలంగాణపై కాంగ్రెసు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. త్వరలో తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఉంటాయన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజీనామాలతో డ్రామాలు ఆడుతోందన్నారు. వారు డ్రామాలు ఆపి తెలంగాణపై తమ పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలకు రాజీనామాలతో పనేమిటని ప్రశ్నించారు. ఆ పార్టీలోనే స్పష్టమైన వైఖరి లేదన్నారు. త్వరలో తమ పార్టీ విధానం చెబుతామన్నారు.
పొంగులేటి ఫైర్
తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిజ స్వరూపం బయటపడిందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి న్యూఢిల్లీలో అన్నారు. కాగా సీమాంద్ర నేతల భేటీకి కేంద్రమంత్రులు పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి హాజరు కాలేదు.
విచ్చిన్నం చేస్తే ఊరుకోం: బైరెడ్డి
రాయలసీమను విచ్ఛిన్నం చేస్తే ఊరుకునేది లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. రాయలసీమను ముక్కలు చేస్తే వచ్చేది బ్రోకర్ల రాజ్యమన్నారు. కోస్తాంధ్ర మోసాలను భరించే స్థితిలో సీమ లేదన్నారు. సీమ తలగలబడుతుంటే తమ ప్రాంత నేతలు రోమన్ చక్రవర్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications