రాజీనామాలపై జగన్ రాజీ!: రెండు రోజుల్లో టిపై నిర్ణయం

YS Jagan - Srikanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రాజుకున్న చిచ్చును ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చల్లార్చే ప్రయత్నాలను ప్రారంభించారు! ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు శ్రీకాంత్ రెడ్డి, వంగవీటి రాధా, కొడాలి నానిలు ఆస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న అధ్యక్షుడు జగన్‌ను కలిశారు. పార్టీలో రాజుకున్న తెలంగాణ రాజీనామాల వేడి, అవనిగడ్డ ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్... తెలంగాణపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకుందామని, ప్రస్తుతానికి వాతావరణాన్ని కూల్ చేయాలని వారికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.

జగన్‌తో భేటీ అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... విభజనపై కాంగ్రెసు పార్టీ నిరసిస్తూ రాజీనామాలు చేయడం తమ వ్యక్తిగతమని, అది పార్టీ నిర్ణయం కాదని చెప్పారు. తెలంగాణపై పార్టీ వైఖరిని రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా ఈ సమస్యను కేంద్రం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణ నేతలు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలతో ఆమె ఈ రోజు సాయంత్రం మరోసారి భేటీ కానున్నారు. భేటీ కోసం మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు వరంగల్ నుండి హైదరాబాదుకు వచ్చారు. పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణా రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డిలు హాజరయ్యే అవకాశముంది.

సిద్ధాంతం లేని పార్టీ: కిషన్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధాంతం లేని పార్టీ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం అన్నారు. జగన్ పార్టీ కూడా ప్రజారాజ్యం లాగే మాయం కావడం ఖాయమన్నారు. ఆ పార్టీ తెలంగాణపై వైఖరి చెప్పకుండా రాజీనామా చేయడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెసు ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు.

సమైక్య ఫ్లెక్సీలు చించివేసిన జెఏసి

హైదరాబాదులో కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమైక్యాంధ్ర ఫ్లెక్సీలను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి చించి వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+