కిరణ్ రెడ్డి, బొత్సకు సంకేతాలు: విభజన వైపు మొగ్గు?

ఒక్కొక్కరితో అరగంటకు పైగా తెలంగాణపై చర్చించారు. ఈ సమయంలో కిరణ్, బొత్సలకు డిగ్గీ, ఆజాద్‌లు విభజనపై సూచన ప్రాయంగా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అధిష్టానం విభజనకు అనుకూలంగా ఉండటంతో ఆ ఇద్దరు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారట. అయితే ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దే తేల్చుకోవాలని డిగ్గీ, ఆజాద్‌లు సూచించినట్లుగా ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
విభజనపై సూచనప్రాయంగా సంకేతాలిచ్చిన నేతలు ఎలాంటి పరిస్థితిలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారట. ముగ్గురు నేతల నుండి లిఖిత పూర్వక స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. విభజనపై సూచన ప్రాయంగా సంకేతాలు ఇవ్వడంతో సీమాంధ్ర నేతల్లో అసంతృప్తి కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఎలా విభజిస్తారనే అంశం పైన మాత్రం సంకేతాలు ఇవ్వలేదని సమాచారం. రాయల తెలంగాణ కాకుండా తెలంగాణకే మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.
మరోవైపు సీమాంధ్రలో అదనపు బలగాలు మోహరిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా అదనపు బలగాలరు లేవు. కేవలం హైదరాబాదులో మాత్రమే బలగాలను మోహరించారు. సీమాంధ్రలో అదనపు బలగాలను మోహరించడం ద్వారా తెలంగాణకే అధిష్టానం మొగ్గుచూపుతుందని కూడా చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్ర మంత్రుల మాటల్లో కూడా తెలంగాణ వైపు మొగ్గు చూపుతుందన్న ఆందోళన కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications