మేమేం చేయాలి?: విజయమ్మకి కొండా సురేఖ డెడ్‌లైన్

ఇతర పార్టీల్లాగే తమ పార్టీ కూడా సీమాంధ్ర పార్టీలాగా ముద్రపడే అవకాశముందన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. రాజీనామాలతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సీమాంధ్ర పార్టీగా ముద్ర వేస్తున్నారని, ఇప్పుడు తామేం చేయాలో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎటువంటి చర్చ జరగకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎలా రాజీనామా చేశారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణపై పార్టీ నిర్ణయం ప్రకటించకుంటే తెలంగాణ నేతలం అందరం భేటీ అయి భవిష్యత్తు నిర్ణయంపై చర్చిస్తామని అన్నారు. రాజీనామాలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు.
ఎమ్మెల్యేల రాజీనామా వ్యక్తిగతమా లేక పార్టీ ఆదేశానుసారమా చెప్పాలని, పార్టీ నిర్ణయం కూడా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడితే తాము కూడా తమ ప్రాంత ప్రజల మనోభావాల కోసం రాజీనామాలు చేయాల్సి వస్తుందన్నారు.
విజయమ్మతో భేటీ
ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు కెకె మహేందర్ రెడ్డి, విజయా రెడ్డిలు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications