కిరణ్‌తో ఫిక్సింగ్: హరీష్, జగన్ పార్టీ ఆఫీస్‌వద్ద ఆందోళన

కాంగ్రెసు పార్టీ కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి రాజీనామా, సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి లేఖ వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే కబ్జా చేసిన భూములు పోతాయని ఆదాల ప్రభాకర రెడ్డి వంటి నేతలు భయపడుతున్నారే తప్ప సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందడం లేదన్నారు. తెలంగాణ ఇవ్వాలని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణను వ్యతిరేకించే వారిని చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతల తీరు దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెరాస చెబుతున్నట్లుగా వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసులు ఆంధ్రా పార్టీలే అన్నారు. ఎపి ఎన్జీవోలను ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన
విభజనను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో పలువురు తెలంగాణవాదులు శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications