విభజనపై నిర్ణయం: సీమాంధ్రకు అదనపు బలగాలు?

సీమాంధ్ర జిల్లాలకు 15 కంపెనీలను కేటాయించగా, హైదరాబాద్ లో 10 కంపెనీలను వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తథ్య మన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఇక సీమాంధ్రలో ఎక్కువ బలగాలను మోహరించనుండటంతో విభజన దిశగానే నిర్ణయమా? అన్న సందేహాలూ ఊపందుకున్నాయి. రాష్ట్రానికి 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
గురువారం డిజిపి దినేష్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి టిపి దాస్, అదనపు డిజిలు గోపాల్ రెడ్డి, తేజ్‌దీప్ కౌర్ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై వీరు కేంద్రానికి నివేదించినట్లు తెలిసింది. ప్రత్యేక, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో ఎటు మొగ్గితే ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందన్నదానిపై ఉన్నతాధికారులు తెలుసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత హోంశాఖ అధికారులు ముఖ్యమంత్రితో చర్చించి పారామిలిటరీ మోహరింపునకు ఏర్పాట్లు చేశారు. పంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటికే 40 కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఉన్నాయి.
నక్సల్స్ సమస్యపై డిజిపి
రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో నక్సలైట్ల సమస్య పెరుగుతుందా? అని న్యూఢిల్లీలో డిజిపి దినేష్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. వంతెన వచ్చినప్పుడే దాటుతామని, ఏదో జరిగిపోతుందని, మరోదో ఇప్పుడు ఊహించుకోవడం తగదని, ఈ ప్రశ్నే సరికాదని, సమాధానం ఇచ్చేందుకు తాను సరైన వ్యక్తినీ కాదని, రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య అదుపులో ఉందని సమాధానమిచ్చారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications